13 March, 2026 | 11:33 PM

ప్రజలకు తాగునీటి సౌకర్యార్థం.. సిరికొండలో చలివేంద్రం ప్రారంభం

13-03-2026 10:12 PM

సిరికొండ,(విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని శ్రీలొంక రామలింగేశ్వర ఉపదేవాలయం ఎదురుగా శుక్రవారం గ్రామ ఉపసర్పంచ్ గ్యామ శోభన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో మనోహర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం మంచి సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మండల ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఉపసర్పంచ్ గ్యామ శోభన్ మాట్లాడుతూ... గత నాలుగు సంవత్సరాలుగా మండల ప్రజల సౌకర్యం కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కోరారు.