13 March, 2026 | 11:26 PM

ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఎన్నికల్లో మార్పు కోరుకోవాలి

13-03-2026 10:07 PM

జిల్లా సహాయ కార్యదర్శి మహంకాళి సోమయ్య డిమాండ్

తుంగతుర్తి (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నికల్లో సభ్యత్వం కలిగిన ప్రతి వ్యక్తి మార్పు కోసం అభివృద్ధి కోసం నూతన వ్యక్తులకు అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాంకాళి సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

వారు శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ... గత 20 సంవత్సరాల నుండి సభ్యత్వం కలిగిన వ్యక్తులకు ఓటు అవకాశం రాకపోవడం దారుణమని అన్నారు. 12 సంవత్సరాలకు పైగా పదవుల్లో ఉంటూ, తిరిగి పదవి కాంక్ష తో పోటీలో మళ్లీ నిలబడడం విడ్డూరంగా ఉందని, పేద ఆర్యవైశ్యుల ప్రయోజనాల దుష్ట అభివృద్ధి కోసం కాంక్షించే పోటీలోని నూతన వ్యక్తులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల్లో సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలని డిమాండ్ చేశారు