మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో చలివేంద్రాన్ని సర్పంచ్ గాధగోని సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎండకాలంలో త్రాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, డీహైడ్రేషన్ నుంచి రక్షణ పొందడానికి తరచూ నీరు తాగడం ఎంతో అవసరమని తెలిపారు. చలివేంద్రం ద్వారా గ్రామస్థులకు త్రాగునీరు అందుబాటులో ఉంటుందని చెప్పారు.అదే సమయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్ ప్లేట్లు ఉపయోగించడం ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాస సందీప్, వార్డు సభ్యులు అమరగొండ ప్రభుదాసు, తిమ్మనగరం దేవదాసు, మాజీ ప్రజా ప్రతినిధులు కడారి రామ్ రెడ్డి, ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.






