25 April, 2026 | 4:50 PM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఓ

25-04-2026 03:28 PM

మానకొండూరు, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామఫీడర్ ఛానల్ పనులు డిఆర్డిఓ శ్రీధర్ శనివారం పర్యవేక్షించారు. ఉపాధి హామీ కూలీలతో క్షేత్రస్థాయి సమస్యలు,  కూలీలసమీకరణ, వేతన బకాయిలు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు ఓఆర్ఎస్,మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు.ఎంపీడీవో వరలక్ష్మి,ఈజీఎస్  సిబ్బంది,  పంచాయితీ కార్యదర్శి ,మేట్, కారోబార్ తదితరులు పరిశీలన సమయంలో ఉన్నారు.