సత్తుపల్లి ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాల్లో
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్
సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులతో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో చర్చలు సఫలమైన సందర్భంగా, ఆర్టీసీ కార్మికులు అందించిన వరాలు జల్లుల సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికులతో కృతజ్ఞత తెలుపుతూ సంబరాల్లో పాల్గొన్న.. డాక్టర్ మట్టా దయానంద్ ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ , రవీందర్ సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, సత్తుపల్లి ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులు తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పులాభిషేకం మరియు పాలాభిషేకం చేసిన ...డాక్టర్ మట్టా దయానంద్ మరియు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర విషాదం వ్యక్తం చేసిన... సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే. రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.






