జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ అశోక్ కుమార్
15-07-2026 08:43 PM
మంచిర్యాల క్రైం,(విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) పర్యవేక్షకులు(సూపరింటెండెంట్)గా డాక్టర్ ఎం అశోక్ కుమార్ బుధ వారం బాధ్యతల స్వీకరించారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గా పని విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ కి జీజీహెచ్ ఇంచార్జ్ పర్యవేక్షకులుగా నియమిస్తూ ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.






