calender_icon.png 9 February, 2026 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు

08-02-2026 12:00:00 AM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ 

ముషీరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానంద నగర్ బస్తీ వాసుల ఇళ్లను గత 2 ఏళ్ల క్రితం అధికారులు నిర్ధాక్షణంగా కూల్చివేసిన నాటి నుండి బస్తీ వాసులతో కలిసి చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని   గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. రెండేళ్లుగా బాధితులకు అండగా ఉంటూ అనేక సార్లు ప్రభు త్వ అధికారులు హైదరాబాద్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్‌ఓ చుట్టూ తిరిగి ఇండ్లను సాధించుకున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం వివేకానంద నగర్‌లో బస్తివాసులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. 

అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్  ప్రత్యేక చొరవతో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్  సహకారంతో ఎట్టకేలకు బాధితులకు డబు ల్ బెడ్ ఇళ్లు మంజూరు కావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వరుసగా కలెక్టర్‌తో సమీక్షిస్తూ, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇళ్ళు మంజూరు చేయించిన అనంతరం శనివారం కలెక్టర్ ఆమో దంతో  ముషీరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల ప్రోసీడింగ్ ప్రక్రియను బస్తీ వాసులు పూర్తి  చేసుకున్నారు.

రాజ్య సభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ఇతర అధికారుల సమక్షంలో వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు అందించనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ సం దర్భంగా బస్తీ వాసులతో కలిసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, స్వామి వివేకానంద నగర్ బస్తీ అధ్యక్షుడు ఎన్. ఎల్లమ్, ఎంబి. కృష్ణ, నందు, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు, బాలరాజ్, లచ్చమ్మ, జయలక్ష్మి, అన్నపూర్ణ, సువర్ణ, భారతి, కన్యాకుమారి, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.