31 May, 2026 | 3:00 AM

DOST Application 2026: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

13-04-2026 02:46 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం, 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ' (Degree Online Services, Telangana) ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం Degree Online Services Telangana (DOST 2026) నోటిఫికేషన్ విడుదలైంది. dost application 2026, dost application date, dost telangana వివరాలను ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్(Higher Education Council Chairman) బాలకృష్ణ రెడ్డి, మూడు దశల ప్రవేశ ప్రక్రియను వివరిస్తూ అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం మూడు దశల్లో దోస్త్ రిజిస్ట్రేషన్(DOST Registration)కు అవకాశం కల్పించారు.

తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ మరియు ట్రెండింగ్ అప్డేట్స్ కోసం Vijayakranthi హోమ్‌పేజీని చూడండి

DOST application 2026 ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై మూడు దశల్లో జరుగుతుంది. విద్యార్థులు dost.cgg.gov.in ద్వారా ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలిషెడ్యూల్ ప్రకారం, మొదటి దశ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు, వెబ్ ఆప్షన్లు ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశ సీట్ల కేటాయింపు మే 14న ప్రకటించబడుతుంది. ఆ తర్వాత మే 15 నుండి మే 23 వరకు ఆన్‌లైన్ స్వీయ-నివేదిక (self-reporting) ప్రక్రియ జరుగుతుంది. రెండవ దశ రిజిస్ట్రేషన్ మే 15 నుండి మే 25 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు మే 26 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ దశకు సంబంధించిన సీట్ల కేటాయింపు మే 30న జరగనుంది. అలాగే స్వీయ-నివేదన (Self-reporting) మే 31 నుండి జూన్ 5 వరకు కొనసాగుతుంది.

డిగ్రీ అడ్మిషన్లు, DOST అప్డేట్స్ కోసం మా ఎడ్యుకేషన్ న్యూస్ విభాగాన్ని సందర్శించండి

3వ దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31 నుండి జూన్ 15 వరకు కొనసాగుతుంది. వెబ్ ఆప్షన్లు జూన్ 16 వరకు అందుబాటులో ఉంటాయి. తుది సీట్ల కేటాయింపు జూన్ 20న విడుదల అవుతుంది. అభ్యర్థులు జూన్ 20, జూన్ 25 మధ్య ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది 121 డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు షెడ్యూల్‌ను జాగ్రత్తగా అనుసరించి, నిర్దేశించిన కాలపరిమితిలోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. 

DOST Application Date 2026

  • 1st Phase Registration: ఏప్రిల్ 15 – మే 7
  • Web Options: ఏప్రిల్ 30 – మే 8
  • Seat Allotment: మే 14
  • 2nd Phase Registration: మే 15 – మే 25
  • Seat Allotment: మే 30
  • 3rd Phase Registration: మే 31 – జూన్ 15
  • Final Allotment: జూన్ 20

FAQ 

ప్ర: what is dost application?

సమాధానం: ఇది తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్.

ప్ర: dost application 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

సమాధానం: ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుంది.

ప్ర: dost.cgg.gov.in అంటే ఏమిటి?

సమాధానం: ఇది DOST అధికారిక వెబ్‌సైట్.