5 July, 2026 | 5:57 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

పూడిక తీత పనులు ఆపొద్దు

01-11-2025 12:14 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, భవిష్యత్తులో వరద ముప్పును నివా రించే లక్ష్యంతో హైడ్రా కార్యాచరణను ము మ్మరం చేసింది. నాలాల్లో పూడిక తీత పను లు ఆపొద్దు, ఎక్కడా నీరు నిలవొద్దు అం టూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరంలోని పలు చెరువులు, నాలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాల్లో నాలాల్లో పూడిక తీత పనులను పర్యవేక్షించిన కమిషనర్, వర్షాలు లేని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది పూడిక తీయడం వల్ల భారీ వర్షాలు పడినా పెద్దగా వరద ముప్పు రాలేదు. వచ్చే ఏడాది అసలు సమస్యే తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

కాగా శంషాబాద్ మం డలంలో కమిషనర్ పర్యటిస్తున్న సమయంలో, చిన్న, పెద్ద గోల్కొండ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబో సుకున్నారు. సారూ.. వర్షం పడితే ఔటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్లు నీటితో నిండిపోతున్నాయి. మేము ప్రయాణించే ఆర్టీసీ బస్సు నీళ్లలో ఆగిపోవడంతో స్కూల్‌కి వెళ్లలేకపోతున్నాం అంటూ వారు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన కమిషనర్, వరద కాలువల్లో పూడికను తొలగించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల ని అధికారులను ఆదేశించారు.