మాతో పెట్టుకోవద్దు!
- ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే మీ భౌగోళిక అస్తిత్వానికే ముప్పు
- చరిత్రలో ఉంటారో.. లేదో తేల్చుకోండి
- పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్
న్యూఢిల్లీ, మే 16: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై ప్రయోగించాలని చూస్తే, మాతో పెట్టుకుంటే ప్రపంచపటంలో దాయా ది దేశం భౌగోళిక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని, చరిత్రలో ఉంటారో? లేదో? తేల్చుకోవాలని, ధోరణి విడనాడకుంటే ఆపరేషన్ సిందూర్ 2 వెర్షన్ తీవ్రంగానే ఉంటుం దని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్ ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చేవారిని ఒకేవిధంగా చూస్తుందని జీరోటోలరెన్స్ విధానాన్నే అనుసరిస్తుందని స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్‌లో యూనిఫామ్ అన్‌వీల్డ్ నిర్వహించిన ‘సేవా సంవాద్’ అనే కార్యక్రమంలో ద్వివేది మాట్లాడారు.
పహెల్గామ్ ఘటన తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. పాకిస్థాన్ చిన్నతప్పుచేసినా భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా అప్ప ట్లో తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆ సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు కూడా అందించామన్నారు. పొరుగుదేశం తీరును మార్చుకోకుంటే ఆపరేషన్‌కు సంబంధించిన రెండో వెర్షన్ తీవ్రస్థా యిలో ఉంటుందని హెచ్చరించారు.
భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపైనే దృష్టి పెడుతుందని, తమమార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, ధీటుగా స్పందిస్తుందన్నారు. భారతదేశం సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సైన్యం అవసరమై న చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నా రు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగానే ఉన్నా, ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు.
విద్యార్థులనుద్దేశిం చి మాట్లాడుతూ.. మనుషులకు విశ్రాంతినిచ్చే ఓ కేఫ్ ప్రారంభించాలనేది తన కల అన్నారు. తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దీనిని ఏర్పాటు చేయాలని అనుకుంటు న్నట్లు చెప్పారు. కప్పు కాఫీ తాగుతూ సేదతీరే విధంగా ఉంటుందన్నారు. అంతేగాక ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తన మనసులోని మాటను బయటపెట్టారు.






