పశు ఔషధ బ్యాంక్‌నకు దాతల విరాళం అభినందనీయం
పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య
కోదాడ, మే 17 : కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్య శాలలో పశుపోషకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ నకు పశు ఔషధాలను విరాళంగా ఇచ్చిన జంతు ప్రేమికులైన దాతల సహకారం అభినందనీయం అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నడిగూడెం మండలం పశువైద్యాధికారులు డా మాడుపల్లి రవికుమార్, డా అఖిల దంపతులు పదివేల రూపాయలు, నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి విరాళం ఐదువేల రూపాయలు,
ఉపాధ్యాయుని కుడుముల నిర్మల ఉపేంద్రయ్య విరాళం ఒక వేయి రూపాయలు మొత్తం పదహారు వేల రూపాయల తో వివిధ అంతర్జాల మాధ్యమాల ద్వారా డిస్కౌంట్ పద్ధతిలో సుమారు డ్బ్బు వేల రూపాయల విలువైన శస్త్ర చికిత్సల మత్తు సూదులు-50, కుట్లకు వాడే పిన్నుల మిషన్ లు, కుట్ల దారాలు, ఇతర పనిముట్లు అత్యవసర పశు ఔషధాలు, పరికరాలు పశు ఔషధ బ్యాంక్ నకు సేకరించడం జరిగిందని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు.
పట్టణం నుండే కాక జిల్లా నలుమూలల నుండి, పక్క జిల్లాలు మరియు పక్క రాష్ట్రం నుండి వస్తున్న సంక్లిష్ట సమస్యల జంతువులకు ఎంతగానో ఈ ఔషధాలు ఉపయోగకరమని, అవి అందించిన దాతల దాతృత్వం వేలకట్టలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమములో చిలుకూరు మండల పశువైద్యాధికారి డా కే వీరారెడ్డి, సిబ్బంది పోటు వెంకటేశ్వరరావు, రాజు, చంద్రకళ పాల్గొన్నారు.






