శివాంజనేయ స్వామి ధ్వజ స్తంభానికి విరాళం
కౌన్సిలర్ పెడకంటి సేవా స్పూర్తి
కల్లూరు,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు కట్టపై వెలసిన శివాంజనేయ స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభానికి 18వ వార్డు పుర కౌన్సిలర్ పెడకంటి రామకృష్ణ తన సేవా భావాన్ని చాటుకున్నారు.మంగళవారం ఆయన తన స్నేహితులతో కలిసి ఆలయాన్ని సందర్శించి, అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ధ్వజస్తంభ నిర్మాణానికి వితరణగా రూ.25 వేలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా పట్టణానికి చెందిన కొటికలపూడి కళ్యాణ్ కిషోర్ కూడా తన వంతుగా రూ.10 వేల విరాళాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పెడకంటి రామకృష్ణ, స్వామివారి సేవలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పెడకంటి రామకృష్ణ, కొటికలపూడి కళ్యాణ్ కిషోర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటేపల్లి రజనీకాంత్, గుగులోత్ బాలు సందీప్, బయ్యవరపు నరేంద్ర, వలసాల సూర్యనారాయణరావు, మోహన్ రావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




