14-02-2026 09:32:11 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ద్వారకా నగర్ ఫేస్-2 శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ రూ.50,000 విరాళం అందజేయడం జరిగింది. శనివారం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం ఆలయ కమిటీ సభ్యులకు యాభై వేల రూపాయలు విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం, భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆ హనుమంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విరాళంఅందజేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, మూడో డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కాలనీ ప్రెసిడెంట్ రాజు, ప్రవీణ్, స్థానిక నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.