27 April, 2026 | 4:24 PM

రాజరాజేశ్వర శివాలయానికి స్టీల్ ప్లేట్ల విరాళం

27-04-2026 02:01 PM

స్టీల్ ప్లేట్లను విరాళం అందిస్తున్న భక్తుడు ఉప్పు విట్టల్

బోథ్,(విజయక్రాంతి): ప్లాస్టిక్ నిషేధించాలన్న సంకల్పంతో సోనాల మండల కేంద్రంలోని రాజరాజేశ్వర శివాలయానికి సోమవారం భక్తులు ఉప్పు విట్టల్ 100 స్టీల్ ప్లేట్లను ఆలయానికి అందించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాల సందర్భంగా ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం వల్ల అనర్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం స్టీల్ ప్లేట్లను అందిస్తున్నామన్నారు.