ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
27-04-2026 01:58 PM
నస్పూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ హైదరాబాద్ దినోత్సవ వేడుకలు నస్పూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు సోమ వారం ఘనంగా నిర్వహించారు. నస్పూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు బిఆర్ఎస్ పార్టీ జెండా పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






