26 April, 2026 | 2:23 PM

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

30-09-2025 05:12 PM

చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని ఎలేటి రామయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న అభయ ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి చెందిన కొత్తురి విజేందర్ రెడ్డి మంగళవారం కమిటీ సభ్యులకు రూ.101,116లు అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఈ విరాళం ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా విరాళాన్ని అభినందిస్తూ వారికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలవేని శ్రీను, మర్రి నరేష్, ఏలేటి సురేందర్, కనుకుల అర్జున్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.