1 April, 2026 | 1:59 AM

మేకల మందపై కుక్కల దాడి

01-04-2026 12:28 AM

18 మేకలు మృతి

చేవెళ్ల, మార్చి 31 (విజయక్రాంతి): మేకల షేడ్ లోకి వీధి కుక్కలు దూరి మందపై దాడి చేసిన ఘటన చేవెళ్ళ మున్సిపాలిటీలోని దేవుని ఎర్రవల్లి వార్డులో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంకంటి శ్రీశైలం మేకల సాదుకుంటున్నడు. మేకల షెడ్ లోకి వీది కుక్కలు దూరి 22 మేకలను వాటి పిల్లలను ఇష్టారీతిన కొరికి గాయపర్చయి.

ఈ దాడిలో 18 మేకలు స్పాట్ లోనే చనిపోగా, మిగతా మేకలు చావు బతుకుల మధ్యన కొట్టు మిట్టాడుతున్నయి. బాధితుల పిర్యాదు మేరకు చేవెళ్ళ పశువైద్యలు డా. తిరుపతి రెడ్డిఘటన స్థలానికి వెల్లి దేవుని ఎర్రవల్లి మున్సిపల్ కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ గ్రామ పెద్దల సమక్షంలో చనిపోయిన మేకలకు పోస్ట్ మార్టం నిర్వహించి గాయపడిన వాటికీ చికిత్స చేసి రాబీస్ వ్యాధి సోకకుండా టీకాలు వేశారు.

ఈ విషయం పై అధికారులకు తెలిపారు.అయితే సచ్చిన జీవాలను చూసి రైతు బోరున ఏడవడంతో గ్రామస్తులు పలువురు ఓదార్చారు. వీది కుక్కలు జీవుల రక్తానికి మరిగి చెలరేగుతుంటే సన్న జీవుల సాదేదెట్లా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. మునుముందు పశువుల కాపారులపై దాడి చేస్తాయేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సన్నజీవాలే కుటుంబానికి జీవనాదారంగా బ్రతుకుతున్న రైతు కుటుంబంకు రూ.2.5లక్షల నష్టం వాటిల్లిందని పెద్ద మనస్సుతో రైతు కుటుంబంకు ఆర్థిక సాయం అందించాలని దేవుని ఎర్రవల్లి మున్సిపల్ కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ కలెక్టర్‌ను కోరారు.