ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కొమరయ్య అని, ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రైతు ప్రజాసంఘాలను ఏర్పరిచి వెట్టి చాకిరి అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలను ముందుండి నడిపార న్నారు.
ఇలాంటి యోధుడికి రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బాండ్ పై, మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, చంద్రగిరి చంద్రమౌళి, గోలివాడ నర్సింహులు, కీర్తి రవి, వేముల అశోక్, అంకం సతీష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




