27 February, 2026 | 5:14 PM

మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో 103 కిలోల బరువున్న మహిళకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు

27-02-2026 12:27 AM

ముత్తారం, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన 45 సంవత్సరాల మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో పాటు తీవ్ర రక్తస్రావం తో బాధ పడుతూ ముత్తారం మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం సంప్రదించగా వెంటనే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి విషయం తెలియగానే మంత్రి సూచనల మేరకు సదరు పేషెంట్ ను పెద్దపల్లి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ కు తెలియడంతో పెద్దపల్లి మాతాశిశు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ పేషెంట్ కి గర్భ కోశం లో ప్రాబ్లం ఉందని గుర్తించి ,అవసరం ఉన్న పరీక్షలు అన్ని నిర్వహించారు.

ఈ పేషెంట్ 103 కిలోల బరువు కలిగి ఉందని, ఇది చాలా కష్టతరమైన ఆపరేషన్ అయిన కూడా అత్యంత నైపుణ్య, అనుభవం ఉన్న డా. బి. శ్రీనివాస్ ను హైదరాబాద్ నుంచి పిలిపించి గురువారం ఆ మహిళకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు.తరచూగా హైరిస్క్ ఆపరేషన్స్ నిర్వహించడంలో ముందున్న వైద్యులను మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ ని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అభినందించారు.

అలాగేపెద్దపల్లి ఆసుపత్రి లో అందుతున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని శ్రీధర్ ఒక ప్రకటన లో తెలిపారు. వెంటనే స్పందించి వైద్యం చికిత్స అందించిన వైద్యులకు వైద్యులకు, మంత్రి శ్రీధర్ బాబుకు మధు జడ్పిటిసి సదానందం కు రాజేశ్వరి భర్త, తమ్ముడు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.