27 February, 2026 | 8:50 PM

భావి భారత టెక్కీలకు ’అరిస్టాటిల్’ బాట

27-02-2026 12:28 AM

డేటా సైన్స్, ఏఐపై ఉచిత వర్కషాప్ విజయవంతం

మొయినాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిరూపిస్తూ, మొయినాబాద్లోని అరిస్టాటిల్ పీజీ కాలేజీలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మరియు అడ్వాన్స్ ఎక్సెల్ అంశాలపై రెండు రోజుల ఉచితవర్కషాప్ ఘనంగా నిర్వహించారు. టెక్స్ అకాడమీ సహకారంతో జరిగిన ఈ శిక్షణలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.

నైపుణ్యమే విజయానికి తొలిమెట్టుటెక్స్ అకాడమీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఐటీ రంగంలో డేటా సైన్స్ మరియు కృత్రిమ మే ధస్సుకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. విద్యార్థులు కేవలం థియరీకి పరిమితం కాకుండా, ఇలాంటి అడ్వానస్డ్ నైపుణ్యాలను నేర్చుకుంటే కెరీర్లో త్వరగా స్థిరపడొచ్చని సూచించారు. సాఫ్ట్వేర్ డెవలపర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవస్థల్లోని లోపాలను గుర్తించడంలో, పనితీరులో ఖచ్చితత్వాన్ని పెంచడంలో AI కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

అడ్వాన్స్ ఎక్సెల్ నైపుణ్యాలు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎలా తోడ్పడతాయో ట్రైనర్ వినయ్ బాబు కందుల ప్రా క్టికల్గా వివరించారు.ఎంబీఏ విద్యార్థులకు ఈ రంగాలు ఎలా ప్లస్ అవుతాయో కోఆర్డినేటర్ మల్లారెడ్డి సాన్వల్లి వివరించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. టెక్స్ అకాడమీ వారు ఉచితంగా ఈ వర్కషాప్ నిర్వహించడం అభినందనీయం.‘ ప్రిన్సిపాల్, శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అరిస్టాటిల్ కళాశాల అధ్యాపక బృందం, టెక్స్ అకాడమీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.