9 April, 2026 | 5:04 AM

అనురాగ్ విశ్వవిద్యాలయం విద్యార్థికి డాక్టరేట్ ప్రదానం

09-04-2026 01:26 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధనా విద్యార్థి అబ్దుల్ అలీమ్ క్లస్టరింగ్, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ ఎనర్జీ-ఎఫిషియెంట్ వైర్లెస్ సెన్సార్ నెట్వరక్స్ అనే అంశంపై పరిశోధన చేసి, పర్యవేక్షకులు డాక్టర్ డాక్టర్ రాజేష్ తుమ్మ మార్గదర్శకత్వంలో తన డాక్టరల్ పరిశోధనను పూర్తి చేశాడు. ఈపరిశోధనకు సంబంధించిన వైవా వోస్ పరీక్షను 30 మార్చి 2026 న నిర్వహించగా, బాహ్య పరీక్షకులుగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, గుల్బర్గా కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లాయక్ అలీ పాల్గొన్నారు.

అనురాగ్ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి, ఆర్ అండ్ డి  డీన్ డాక్టర్ సతీష్ కుమారన్, ఈసీఈ విభాగం అధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సికిందర్ బాబా, ఇతర విభాగాల అధిపతులు ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వైవా వోస్ పరీక్షలో అబ్దుల్ అలీమ్ తన పరిశోధనను విజయవంతంగా వివరించి, సమర్పించాడు. పరీక్షకుల ప్యానెల్ సిఫార్సుల మేరకు అబ్దుల్ అలీమ్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్.డి) పట్టా ప్రదానం చేయబడింది.