18 March, 2026 | 4:48 PM

వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు

18-03-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించవద్దని, అలా వినియోగిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్ సెంటర్లలో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 6 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయకూడదని, అక్రమ అమ్మకాలు చేయరాదని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి   హెచ్చరించారు.