25 August, 2026 | 3:40 AM

22 ఏ భూముల విషయంలో బ్రోకర్లను నమ్మొద్దు

25-08-2026 12:00 AM

అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి

రంగారెడ్డి, అగస్టు 24(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని 22-A నిషేధిత జాబితా భూములు మరియు ’భూ భారతి’ రికార్డుల్లో ఉన్న భూముల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సూచించారు. సోమవారం అయన నిషేధిత భూముల వివరాలపై ఒక ప్రకటన జారీ చేశారు. భూ రికార్డులను సరిచేస్తామని, 22-A జాబితా నుండి సర్వే నంబర్లను తొలగించి హక్కులు కల్పిస్తామని చెప్పే మధ్యవర్తులు, బ్రోకర్లను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.

భూ లావాదేవీలు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ అధికారులను కలసి సర్వే నంబర్, భూ స్థితి, 22-A వివరాలు, భూ భారతి రికార్డులను అధికారికంగా నిర్ధారించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయిస్తామనే దళారులకు ఎలాంటి నగదు చెల్లించకూడదన్నారు.

భూములకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంబంధిత తహసీల్దార్ లేదా అధికారిక రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయించి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజలు కేవలం అధికారిక విధానాల ద్వారానే భూ లావాదేవీలు జరుపుకోవాలని, అనధికారిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని కలెక్టరేట్ ఒక ప్రకటనలో కోరింది.