ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం చేయొద్దు
30-06-2026 12:34 AM
నిర్మల్, జూన్ 29 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజాతివానికి వస్తున్న దరఖాస్తులు ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు పెండింగ్ బిల్లులు భూ పరిష్కారాలు వస్తున్నాయి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి తెలిపారు. పరిష్కరించిన అర్జీలు ఇప్పటివరకు వచ్చిన అర్జీలు పెండింగ్ అర్జీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ డిఆర్‌ఓ రమేష్ రాథోడ్ జిల్లా అధికారులు ఉన్నారు.






