30 June, 2026 | 2:19 AM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

30-06-2026 01:33 AM

నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలి

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చలో లోక్‌భవన్ ముట్టడి ఉద్రిక్తం 

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీకు నైతిక బా ధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజినీ కాంత్, టీ నాగరాజు, ఆలిండియా సహాయ కార్యదర్శి ఎండీ అతిక్ అహ్మద్ డిమాండ్ చేశారు.

ఎన్‌టీఏను రద్దు చేయాలని, లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యా ర్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాం డ్ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యం లో లోక్‌భవన్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ... నీట్ రద్దు చేసి రాష్ట్రాలకే పరీక్షలను నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం.. బీజేపీ అసమర్థ పాలన, నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై, చనిపోయిన విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం మాట్లాడకుండా.. పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయించడం అన్యాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉందా? లేక బీజేపీ పాలన ఉందా? అని నిలదీశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తం గా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనానికి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుంచే అరెస్టులు చేసినట్లు  తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే అశోక్‌రెడ్డి, కే శంకర్, జీ శ్రీకాంత్, ప్రవీణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, కరీంనగర్, మమబూబాబాద్, హనుమకొండ, కొత్తగూడెం, నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, భువ నగిరి, భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల జిల్లాలలో ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా అరె స్టులు చేశారని తెలిపారు.