30 June, 2026 | 2:29 AM

ఎంఆర్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

30-06-2026 12:32 AM

జిల్లా వ్యవసాయ అధికారి బొర్కుట్ వెంకటి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి):ఎరువులను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించరాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్ ద్వారానే రైతులకు ఎరువుల విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి బొర్కుట్ వెంకటి ఎరువుల డీలర్లను హెచ్చరించారు.సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని జనకాపూర్ రైతు వేదికలో ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి డీలర్ తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు, అధిక ధరల వసూళ్లు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు ఎరువులు పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్ కుమార్, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.