పెంజర్ల జీపీని తనిఖీ చేసిన డీఎల్‌పీఓ
షాద్‌నగర్, జులై 6 (విజయక్రాంతి): పెంజర్ల గ్రామపంచాయతీలో సోమవారం జిల్లా పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) వరలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చెసారు. ఈ సంధర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం,ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తనిఖీ చేశారు. కార్యాలయానికి విచ్చేసిన డీఎల్పిఓ వరలక్ష్మి శాలువాతో సర్పంచ్ ఎర్రోళ్ల జగన్ సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో రికార్డుల నిర్వహణ,ప్రభుత్వ పథకాల అమలు,మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, పరిశుభ్రత,తరగతి గదుల నిర్వహణను,మధ్యాహ్న భోజనం నాణ్యతను,వంటశాల పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌస్,ఉప సర్పంచ్ శాంతన్ రెడ్డి,వార్డు సభ్యులు కే వేదాంత చారి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






