27 February, 2026 | 9:35 PM

టీచర్ అమ్మగా మారిన జిల్లా కలెక్టర్

27-02-2026 08:18 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ టీచర్ అమ్మగా అవతారం ఎత్తింది. శుక్రవారం లక్ష్మణ చందా మండలం వడ్డేల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల గదిలోకి వెళ్లి కలెక్టర్ పరీక్షల నేపథ్యంలో గణితం ఇంగ్లీష్ సైన్స్ కు సంబంధించిన ప్రశ్నలు  వేశారు.

సమాధానం చెప్పాలని విద్యార్థులను అడిగారు. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా సమాధానం చెప్పడంతో సంతోషం వ్యక్తం చేసిన కలెక్టర్ పదో తరగతిలో మంచి మార్కులు సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఉపాధ్యాయులు ఉన్నారు.