4 May, 2026 | 12:24 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

జేఎన్యూలో విద్యార్థులపై దాడి హేయమైన చర్య: ఎస్‌ఎఫ్‌ఐ

27-02-2026 08:23 PM

దేవరకొండ,(విజయక్రాంతి): జేఎన్యూలో విద్యార్థులపై దాడి హేయమైన చర్య అని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతోనే క్యాంపస్‌లలో మత విధ్వంశాలు స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు. ముసుగులు ధరించి విద్యార్థినుల హాస్టళ్లలోకి చొరబడి, ఇనుప రాడ్లతో దాడి చేయడం పిరికిపంద  చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క మొక్క గణేష్, చీమట శివ, జైరాం, అరవిందు, ప్రశాంతు, సంపత్, కొండల్, మహేష్, గంగరాజు, సాయిరాం, అభిషేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.