4 May, 2026 | 3:22 PM

Breaking News

ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •  

ప్రజా ప్రభుత్వంలో సొంతింటి కల సాకారం

27-02-2026 08:14 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనతోనే పేదల సొంతింటి కల సాధ్యమని మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం హనుమకొండ 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజువాడలో హౌసింగ్ ఏఈ అడ్లూరి నరేందర్ రాజు, డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పున్నం చందర్ లతో కలిసి ఇందిరమ్మ గృహప్రవేశాన్ని నాగరాజు ప్రారంభించారు.

అనంతరం వారు లబ్ధిదారులైన ఉచిత రజిత కరుణాకర్ దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు గన్నబోయిన శ్వేత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుస్సా నవీన్ కుమార్, ఏ.మాధవి, రమ్య, కాంగ్రెస్ శ్రేణులు ఎం.డి సాజిత్, మట్టపల్లి కమల్ కుమార్, ఎం.డి అక్మల్, గణేష్, రాజు, స్వప్న, మీనా, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.