ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు
ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూన్ 21 (విజయక్రాంతి): ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, యోగతో ఆరోగ్యం సాధ్యమవుతుందని, ఆరోగ్యంతో అందమైన జీవితం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఆదివారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఆయుష్, క్రీడల శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ స్వయంగా యోగా ఆసనాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగ అనేది కేవలం వ్యాయామం మాత్ర మే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, డిసిహెచ్‌ఎస్ డా. రాజశేఖర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఉప వైద్యాధి కారి డా. వేణుమాధవ్, నోడల్ అధికారిణి డా. పద్మావతి, నేచురోపతి డాక్టర్ కనకమహాలక్ష్మి, జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత, మహిళలు, యోగా సాధకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






