25 February, 2026 | 5:02 AM

మూడు పువ్వులు ఆరు కాయలుగా మట్టి దందా

25-02-2026 01:36 AM

జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..

జగదేవపూర్, ఫిబ్రవరి 24: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో కొంత మంది అక్రమార్కులు యదేశ్చగా మట్టి దందా సాగిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించే వారిని ని అంతు చూస్తాం అని భయబ్రాంతులకు గురిసీజెస్తున్నారని ప్రజలు గుస గుసల్డుతున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన తిరుమరడం లేదు. రాత్రికి రాత్రే మట్టినీ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మా గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేడా అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ మట్టి దందా వెనకాల కొంత మంది బడా నేతల హస్తం ఉందని అధికారులు సైతం జెంకుతున్నారు అని ప్రజలు చెవులు కోరుకుంటుంన్నారు. ఇకనైనా అధికారులు కళ్ళు తేరచి మామూళ్ళ మత్తు వదిలి గ్రామాన్ని సదర్శించి అక్రమర్కుల ఆగడలకు అడ్డు కట్ట వెయాలని కోరుతున్నారు. ఈ విషయం పై తహసీల్దార్ వివరణ కోరగా మా దృష్టికి రాలేదని సమాచారం లేదని అన్నారు. ఆర్‌ఐ ని పంపించి ఎంక్వయిరీ చేస్తామన్నారు.