21 March, 2026 | 7:45 AM

ఉగాది పచ్చడి పంపిణీ

20-03-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 29(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో  సాయిబాబా ఆలయ ఆవరణలో భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు ప్రజల సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆరంభించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు అనుమాండ్ల శ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు జంజిరాల పుష్పలత, గౌరవ అధ్యక్షు రాలు వనమాల జయ, ప్రచార కార్యదర్శి గుజ్జ రేవతి, ఇరుకుల్ల పుష్పలత, జంజిరాల లక్ష్మీనారాయణ, గుజ్జ మోహన్, వనమాల ధర్మయ్య, పొన్న రామ్ చందర్, జ్యోతి, శ్రీల త, సుజాత, శ్రీదేవి, శోభ, హరీష్, సాయి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.