19 March, 2026 | 3:50 AM

మరిపెడలో రంజాన్ కిట్ల పంపిణీ

18-03-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): మరిపెడ మున్సిపాలిటీలోని 14వ వార్డులో మంగళవారం ప్రభుత్వం అందజేస్తున్న ’ఈద్ కా తోఫా’ కిట్లను 14వ వార్డు కౌన్సిలర్ జాటోతు సురేష్ నాయక్ ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందని, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మార్గదర్శకత్వంలో వార్డులోని అర్హులందరికీ ఈ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల పట్ల చూపుతున్న ఆదరణకు, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, స్థానిక నాయకుల కృషికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సలీం, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు రాధిక, మరిపెడ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ అక్కినపల్లి వెంకట్ సాయి, 14వ వార్డు కాంగ్రెస్ నాయకులు, యాకన్న, పాల్గొన్నారు.