పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
22-08-2026 01:58 AM
మల్దకల్, ఆగస్టు 21: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామపంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఏటీఎం కార్డు తరహాలో మన్నికగా ఉండే ఈ కార్డులతో రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.






