14 August, 2026 | 8:12 PM

Breaking News

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •  

రవి ఫౌండేషన్ ద్వారా చేయూత

14-08-2026 06:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని రవి ఫౌండేషన్ చైర్మన్ గాజుల రవి ఆధ్వర్యంలో పేద కుటుంబానికి చేయూతనందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్ కాలనీకి చెందిన ఆశన్న అనే ఆటో డ్రైవర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబం తీవ్ర విషాదంలో నెలకొంది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో పలువురు దాతలు స్పందించి తమవంతు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

శుక్రవారం నిర్వహించనున్న పెద్దకర్మకు సైతం అవసరమైన నిత్యావసర వస్తువులు సమకూర్చుకునే పరిస్థితి లేదని తెలుసుకున్న రవి ఫౌండేషన్ చైర్మన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ ఆశన్న కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దకర్మ నిర్వహణకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించి కుటుంబానికి అండగా నిలిచారు.