15 August, 2026 | 5:24 AM

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ

15-08-2026 12:19 AM

తాడ్వాయిఆగష్టు,14( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు మాట్లాడుతూ... ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. లబ్ధిదారులు అందరికీ కల్యాణ లక్ష్మి చెక్కులను అందించి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ రాములు, నాయకులు అంబీర్ శ్యాం రావు, రాజేశ్వర్ రెడ్డి, మేకల రాజు,స్వామి రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.