15 August, 2026 | 4:31 AM

లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

15-08-2026 12:18 AM

ఎస్సై దేవేందర్

శంకర్‌పల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్త్స్ర దేవేందర్ హెచ్చరించారు. శుక్రవారం బి డి ఎల్ ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనదారుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్, ధ్రువ పాత్రలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ లేని విద్యార్థులకు వాహనాలను ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేనందున ఎంతోమంది అభాగ్యులు ప్రమాదా లకు గురై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్రలు మంజుల, శ్రీశైలం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.