16 March, 2026 | 9:08 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ

16-03-2026 12:28 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి 

కోదాడ, మార్చి 15 : కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజక వర్గం పరిధిలో మంజూరైన రూ 2కోట్ల 77 లక్షల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం 277 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు.

అనంతరం రంజాన్ మాసం సందర్బంగా నియోజకవర్గంలోని 1000 మంది ఇస్లాం మతస్తులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతమ్మ సుధీర్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి, ఆర్డీఓ సూర్యనారాయణ, తహశీల్దార్ వజీద్ అలీ, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.