23 June, 2026 | 6:09 PM

నేరెళ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ

23-06-2026 04:26 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పసుల భవాని, గజ్జెల నాంపల్లి, గొర్రె కవిత, పొన్నం లక్ష్మి మాట్లాడుతూ తమకు ఇళ్ల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల గృహ కలలను సాకారం చేస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు.