ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పంపిణీ
24-08-2026 09:18 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో కుట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ లను దిర్శించర్ల, చిల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఉచిత యూనిఫామ్ లు పొందిన విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారని, మహిళా సమైక్య ఆధ్వర్యంలో కుట్టడం వల్ల మహిళలకి ఉపాధితో పాటు ఆర్ధిక సౌలభ్యత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దిగించర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, చిల్లేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా నాయక్, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.






