24 March, 2026 | 11:09 PM

నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

08-10-2025 05:00 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని యాపల్ ప్రాంతంలో నివాసముండే నిరుపేద కుటుంబానికి ఆటో కార్మిక సేవా సమితి సభ్యులు అండగా నిలిచి బుధవారం నిత్యవసర సరుకులు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. యాపల్ ప్రాంతానికి చెందిన మారేపల్లి నాగరాజుకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత 7 నెలల క్రిందట నాగరాజు గుండెపోటుతో మరణించగా కూతుర్లు ఇద్దరు చిన్న వారే కావడంతో ఆ కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. పట్టణానికి చెందిన బియ్యాల ప్రవీణ్ కుమార్-శ్రావణి దంపతుల కూతురి పుట్టిన రోజును పురస్కరించుకొని నాగరాజు కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు ఆటో కార్మిక సేవా సమితి ద్వారా అందజేశారు. ఇదిలా ఉండగా నిత్యావసర సరుకులు అందించిన దాతలను, ఆటో కార్మిక సమితి సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సేవ సమితి చైర్మన్ నేరెళ్ళ వెంకటేష్, వైస్ చైర్మన్ ఏదుల పురం రాజు, డైరెక్టర్ సముద్రాల శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, నందిపాటి రవి, పిట్టల రవీందర్, దుర్గాప్రసాద్ డొనేటర్ నేరేటి శ్రీశైలంలు పాల్గొన్నారు.