27 February, 2026 | 11:21 PM

Breaking News

తంగళ్ళపల్లిలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

27-02-2026 09:09 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల సరూప, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో విజయ్ ప్రకాష్ రావు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు.

అధికారులు మాట్లాడుతూ... ఈ పథకాలు పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలని తెలిపారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారి భవిష్యత్తు శుభంగా ఉండాలని ఆకాంక్షించారు. లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.