CJPతో ముగిసిన చర్చలు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు
కేంద్రం, కాక్రోచ్ పార్టీ మధ్య ముగిసిన చర్చలు
కేంద్రం ముందు సీజేపీ మూడు డిమాండ్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party) మధ్య చర్చలు ముగిశాయి. సీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టింది. సీజేపీ మొదటి డిమాండ్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రెండో డిమాండ్: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం. సీజేపీ మూడో డిమాండ్: విద్యార్థులకు కేసులు ఎత్తివేయాలని కోరింది. బాధిత కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు కేంద్రం హామీ ఇచ్చింది.
తమ డిమాండ్లపై రేపు మధ్యాహ్నంలోకా చర్యలు తీసుకోవాలని సీజేపీ సూచించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా(Dharmendra Pradhan resigns) చేసే వరకు ఉద్యమం ఉగదని కాక్రోచ్ పార్టీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని సీజేపీ పేర్కొంది. కేంద్రం, సీజేపీ చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం కీలకంగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం చెప్పేందుకు కేంద్రం సమయం కోరింది.






