calender_icon.png 23 February, 2026 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యంపై డిజిటల్ ప్రభావం!

22-02-2026 12:00:00 AM

ప్రశ్నలే పురోగతికి పునాది, ప్రతి మ నిషిలోనూ పుట్టుకతోనే ఒక ఆలోచనాపరుడు దాగి ఉంటాడు. ఒక చిన్నారి మొదటిసారి ‘ఎందుకు?’ అని అడిగే క్షణం నుంచే ఒక ఆలోచన ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే త పన, చూసినదాన్ని విచారించాలనే స్వభా వం, తెలియని దాన్ని తెలుసుకోవాలనే ఆస క్తి-.. ఇవే మానవ మేధస్సుకు పునాది లాం టివి. చిన్న పిల్లలను గమనిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక చీమ ఒకే దారిలో నడుస్తుంటే అది ఎందుకు అలా చేస్తుందో, ఆకా శం నీలంగా ఎందుకు ఉంటుందని పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండకపోవ చ్చు. కానీ పిల్లల ప్రశ్నల వెనుక ఉన్నది అల్ల రి కాదు, వారి సృజనాత్మక మేధస్సు. కానీ సమాజం, కుటుంబం, వ్యవస్థ- ఈ మూడింటిలో ఎక్కడో ఒకచోట ఆ ప్రశ్నల ప్రవాహం అడ్డుకుంటూ పోతుంది. ‘ఇన్ని ప్రశ్నలు అడగకు’, ‘నిశబ్దంగా ఉండు’, ‘అది అలాగే ఉం టుంది’ అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తూ చిన్నారి ఆలోచన తలుపులను మూసే స్తుంటాయి. ప్రశ్నించడం ఆగిన చోటే ఆలోచన కూడా ఆగిపోతుంది.

ఆలోచన ఆగిన చోటే సృజనాత్మకత క్షీణిస్తుంది. ఇప్పుడు ఆ ఆలోచన సవాలు మరో కొత్త రూపంలో వచ్చింది. అదే డిజిటల్ ప్రపంచం. ఒకవైపు జ్ఞానానికి ద్వారంగా ఉంటూనే మరోవైపు మేధస్సును మాయలో ముంచే శక్తి కూడా దీనికి ఉంటుంది. డిజిటల్ యుగంలో మన పిల్లల ఆలోచనా స్వాతంత్య్రాన్ని ఎలా కాపాడాలి అనే ప్రశ్న తప్పనిసరిగా అడగాల్సిన అవసరముంది. 

ప్రతికూలతలు..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని మన చేతిలో పెట్టింది. సమాచారం క్షణాల్లో అందుబాటు లోకి వస్తోంది. విద్య, వినోదం, సంభాషణలు.. -అన్నీ ఒకే పరికరం లో అందుబాటులోకి రావడం వల్ల ఈ సౌల భ్యం మానవ జీవితాన్ని సులభతరం చేసిం ది. అయితే అదే సాంకేతికత చిన్నారుల సహ జ ఆలోచనా ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆందోళనలు పెరుగుతున్నా యి.

నేటి పిల్లలకు ఆడుకునే మైదానం కంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువ ఆకర్షణీయంగా మారుతోంది. కథల పుస్తకం కంటే వీడియోలు ఎక్కువ ఆసక్తికరంగా కనిపిస్తున్నా యి. శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నది ఏమిటంటే-ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యక్ష సం భాషణ, కథలు, పాటలు, అనుభవాత్మక ఆటలు అత్యవసరం. 

ఇవి మెదడులోని నాడీకణాల అనుసంధానాలను బలపరుస్తాయి. భాషా నైపు ణ్యం, జ్ఞాపకశక్తి, భావ వ్యక్తీకరణ, సామాజిక నైపుణ్యాలు.. ఇవి ప్రత్యక్ష మానవ సంబంధాల ద్వారానే మెరుగు పడతాయి. కానీ అధిక స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల్లో కొన్ని సమస్యలు పెరుగుతున్నాయని అనేక అంతర్జా తీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏకా గ్రత లోపం, ఆందోళన, చిరాకు, నిద్రలేమి, సామాజిక వేర్పాటు, తక్షణ ఫలితాలపై ఆధారపడే అలవాటును డిజిటల్ కంటెంట్ వేగ వంతంగా, రంగులమయంగా, తక్షణ స్పందనలతో రూపొందించబడుతుంది. దీనివల్ల పిల్లల మెదడు నిరంతరం ఉత్తేజిత స్థితిలోనే ఉంటుంది.

నైపుణ్యలేమి..

డిజిటల్ ప్రభావంతో పిల్లల్లో నెమ్మదిగా ఆలోచించడం, లోతుగా చదవడం, విశ్లేషించడం వంటి నైపుణ్యాలు తగ్గే ప్రమాదముం ది. ప్రపంచ దేశాలు ఈ అంశాన్ని గంభీరం గా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలపై పరిమితులు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ డిజిటల్ సేవల చట్టం ద్వారా పిల్లల రక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఆస్ట్రేలియా వయోపరిమితి అమలులో కఠిన విధానాలు తీసుకొస్తోంది. దక్షి ణ కొరియా ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. చైనాలో మైనర్లకు గేమింగ్ సమయాన్ని పరిమితం చేసింది.

ఈ చర్యలు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నా యి. సాంకేతికతను నిరాకరించడం కాదు, దాన్ని నియంత్రించడం అవసరం. పిల్లల డిజిటల్ అలవాట్ల  నియంత్రణ రూపకల్పనలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం.

పిల్లలు చెప్పిన మాటల కంటే చూసిన ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు.పెద్దలు ఎప్పుడూ ఫోన్‌లో మునిగితే, పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరించడం సహజం. కాబట్టి కుటుంబం నుంచే మార్పు మొదలవ్వాలి. ఇంట్లో మొబైల్ స్క్రీన్ టైమ్‌పై స్పష్ట మైన ప్రణాళిక ఉండాలి. భోజనం, నిద్ర సమయంలో పరికరాలను దూరంగా ఉం చాలి. కుటుంబ సభ్యులంతా కలిసి సంభాషణకు, పుస్తక పఠనకు, బహిరంగ ఆటలకు సమయం కేటాయించాలి.

అవగాహన అవసరం..

పిల్లలతో సోషల్ మీడియా గురించి తెర వెనుక చర్చించాలి.ఆన్‌లైన్‌లో ఎదురయ్యే ఇబ్బందులను వారు స్వేచ్ఛగా పంచుకునే వాతావరణం కల్పించాలి. భయం కాకుండా అవగాహన కలిగించాలి. నియంత్రణ కాకుం డా దిశానిర్దేశం చేయాలి. పాఠశాలలు కూ డా బాధ్యత వహించాలి. డిజిటల్ సాక్షరత ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. ఆన్‌లైన్ భద్రత, సమాచార విశ్లేషణ, బాధ్యతాయుత వినియోగం వంటి అంశాలను బోధించాలి. ప్రభుత్వాల స్థాయిలో కూడా కఠిన చర్యలు అవసరం. వయస్సు ధృవీకరణ విధానాల ను కచ్చితంగా అమలు చేయాలి.

హానికర కం టెంట్‌పై కఠిన నియంత్రణలు ఉండాలి. డిజిటల్ వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కృత్రిమ మేధస్సు (ఏఐ) విద్యలో ఒక సాధనంగా ఉపయోగ పడాలి. కానీ అది స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా మారకూడదు. విద్యార్థి ఆలోచించాలి, సాం కేతికత సహాయం చేయాలి. సాంకేతికత మ నిషికి సేవ చేయాలి, మనిషి సాంకేతికతకు బానిస కాకూడదు.

నియంత్రణే మార్గం..

నియంత్రిత డిజిటల్ యుగమే.. సృజనాత్మక భవిష్యత్తు -బాల్యం అనేది భావి సమా జానికి పునాది. ఈ దశలో సృజనాత్మకతను అణచితే, రేపటి ఆవిష్కరణలను మనమే అడ్డుకున్నట్లవుతుంది. డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా నిరాకరించడం సాధ్యం కాదు. కానీ దానిపై నియంత్రణ సాధ్యం. కుటుంబం జాగృతమైతే, పాఠశాల దిశానిర్దేశం చేస్తే, ప్ర భుత్వం దృఢ విధానాలు అమలు చేస్తే..

మన భవిష్యత్ తరాలు మానసిక, సృజనాత్మక, బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు. ప్రశ్నించే స్వభావాన్ని కాపాడాలి. ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించాలి. సాంకేతికతను ఒక సాధనంగా మార్చాలి. ప్రశ్నించ డం ఆపని పిల్లలే రేపటి ఆవిష్కర్తలు. ఆలోచనలు ఆపని రేపటి సమాజమే శక్తివంత మైంది. నియంత్రిత డిజిటల్ వినియోగమే సృజనాత్మక భారత భవిష్యత్తుకు భరోసా.

 వ్యాసకర్త సెల్: 9573666650