22-02-2026 12:00:00 AM
గత రెండు బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు, కీలక హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా అది నెరవేరాలి.
‘మా ప్రభుత్వానికి బడ్జెట్ అంటే కేవలం అంకెల సమాహా రం మాత్రమే కాదు.. అది ఒక ఆకాంక్షల వ్య క్తీకరణ’ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన మొదటి బడ్జెట్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిది బడ్జెట్‌లను ప్రవేశపెడితే నేటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పూ ర్తిస్థాయి బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది.
తాజాగా 2026- ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడవ బడ్జెట్‌ను త్వరలో ప్రవేశపె ట్టబోతున్నది. అయితే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన పదకొండు బడ్జెట్‌లలో రెండు ప్రభుత్వాలు రాష్ర్టంలో 50 శాతానికి పైగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో తక్కువ నిధులే కేటాయించడం జరిగింది. అయితే కేటాయించిన ఆ నిధు ల్లో కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదనే విషయాన్ని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
బలహీన వర్గాల ఓట్లతో అధికారం లోకి వచ్చిన పార్టీలు, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు కాగితాలకే పరిమితమవుతున్న తీరు చూస్తుంటే నోటితో పొగు డుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగానే కనపడుతున్నది.
గతంలో ఇచ్చిన నిధులు ..
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు తక్కువే అని చెప్పొచ్చు. ప్రతి బడ్జెట్‌లోనూ 56 శాతం ఉన్న బలహీన వర్గాలకు కేటాయిస్తున్న నిధులు సగటున 2 నుంచి 3 శాతం మాత్రమే ఉంటున్నాయి. కానీ కేటాయించిన తక్కువ నిధులను కూడా ప్రభుత్వాలు పూర్తిగా ఖర్చు చేయకపోవటం వల్ల ఈ దశా బ్ద కాలంలో బీసీల సంక్షేమం కాగితాలకే పరిమితమైంది.
2014 నుంచి 2025 వరకు 11 బడ్జెట్‌లలో 22 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే.. ఈ మొత్తంలో బీసీల సంక్షేమానికి కేటాయించింది కేవలం 62,951 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 2.75 శాతం మాత్రమే అని చెప్పవచ్చు.
రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీ సీల సంక్షేమానికి 2,022 కోట్ల రూపాయలను (2 శాతం) కేటాయించి 866 కోట్ల రూ పాయలను మాత్రమే ఖర్చు చేసింది. 2023 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం తాము ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 9,200 కోట్ల రూపాయలు (3.16 శాతం) కేటాయించినప్పటికీ అందులో కేవలం రూ. 2,068 కోట్లను మా త్రమే ఖర్చు చేయడం జరిగింది.
ఎంబీసీలోనూ అన్యాయమే!
ఇక బీసీ కార్పొరేషన్‌కు 2014- బడ్జెట్‌లో 115 కోట్ల రూపాయలను కేటాయిం చినా కేవలం 25 కోట్ల రూపాయలను మా త్రమే ఖర్చు చేశారు అలాగే 2024 బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కార్పొరేష న్‌కు 703 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం. 2017 నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయల ను బడ్జెట్ నిధులుగా కేటాయించినా వాళ్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.
ఇక రేవంత్ సర్కార్ కూడా గత రెండు బడ్జెట్‌లలో ఎంబీసీ కార్పొరేషన్‌కు 400 కోట్ల రూపాయలను కేటాయించినా ఒక్క పైసా ఖ ర్చు చేయకపోవటం శోచనీయం. దీంతో ప్ర భుత్వాలు మారినా బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి కేటాయించే నిధుల విధానంలోనూ, వాటిని ఖర్చు చేసే విషయంలోనూ వైఖరి ఏమాత్రం మారలేదన్న విషయం స్పష్టమవుతుంది.
బీసీ డిక్లరేషన్ ఏమాయే?
‘తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షే మాన్ని విస్మరించిందని, మేము అధికారంలోకి వస్తే బీసీల సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని’.. 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
ఈ డిక్లరేషన్‌లో బీసీల సంక్షేమానికి ప్రతి బడ్జెట్‌లో 20వేల కోట్ల రూపాయలు కేటాయి స్తామని, బీసీలకి కూడా సబ్ ప్లాన్ (ప్రత్యేక ఉప ప్రణాళిక) ప్రకటిస్తామనే ప్రధాన హామీలను ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశ పెట్టి న రెండు బడ్జెట్‌లలో వరుసగా రూ. 9,200 కోట్లు, రూ.11,405 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ ఆ నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోగా
బీసీ సబ్‌ప్లాన్ కూడా ప్రకటించలేదు. 2013లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని చివరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సబ్ ప్లాన్ రూపొందిస్తామని శాసనసభ సా క్షిగా ప్రకటించిన హామీని కూడా తెలంగాణ రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడమంటే ఉద్దేశ పూర్వకంగానే బీసీల సం క్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన కలగక మానదు.
ఏమార్చే ప్రయత్నం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత మేర, లింగాయత్, యాదవ, పెరి క, మున్నూరు కాపు, కల్లుగీత కార్మిక సమైక్య లాంటి ఎనిమిది కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రెండు బడ్జెట్‌లలో 50 కోట్ల రూపాయలను కేటాయించి ఖర్చు చేయలేదు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, బీసీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు లాంటి హామీలను కూడా అటకెక్కించడం స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లతో సహా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు.
ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవుల కేటాయింపులో, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యతనిస్తూ 57 కులాలకు కార్పొరేషన్లను జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబునాయుడు కూడా రెండోసారి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి 47 వేల కోట్ల రూపాయలు,
51 వేల కోట్ల రూపాయలను(2026- బడ్జెట్ లో) కేటాయించి తెలంగాణ కంటే బీసీ సంక్షేమానికి నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం ఒక అడుగు ముందు ఉన్నది. డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బడ్జెట్‌లో అరకొరా నిధులు కేటాయించి వాటిని పూర్తిగా ఖర్చు చేయకుండా జిందాతిలస్మాత్ కులగణన ప్రస్తావనతో దేశంలోనే అద్భుతమని వారికి వారే కితాబులు ఇచ్చుకుంటూ బలహీన వర్గాలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.
కనీసం ఈసారైనా!
గత రెండు బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు, కీలక హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యం స్పష్టంగా కనపడుతుంది. ఈ బడ్జెట్‌లోనైనా అది నెరవేరడంతో పాటు హామీ మేరకు నిధులు కేటాయింపుతో పాటు బీసీ సబ్‌ప్లాన్ లాంటి కీలకమైన హామీలపైన రేవంత్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని బలహీన వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది కుల ఆధారిత సమాఖ్యలను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 12 సమాఖ్యలు, సొసైటీలతో కలిపి మొత్తం 20 సమాఖ్యలకు బడ్జెట్‌లో కనీసం మూడువేల కోట్ల రూపాయలను కేటాయించాలి. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించడంతో పాటు ఇటీవల బీసీ కమిషన్ ప్రకటించిన 50 సంచార జాతులకు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాల్సిన అవసరముంది.
తెలంగాణలో గత 11 బడ్జెట్‌లలో బీసీల సంక్షేమానికి కేటాయించిన మొత్తం నిధులు, ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అంతేకాదు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభు త్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
వ్యాసకర్త సెల్: 9885465877