2 September, 2026 | 8:36 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

బిఆర్ టి యు ఆధ్వర్యంలో ధర్నా

02-09-2026 | 07:13pm

ముకరంపుర, సెప్టెంబర్ 2(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా బి.ఆర్.టి.యు(BRTU) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ప్రభుత్వ పాఠశాలల(Government schools) మధ్యాహ్న భోజన వంట కార్మికులు కలెక్టర్ ఆఫీస్(Collector's Office) వద్ద ధర్నా  నిర్వహించారు.  ఆశా వర్కర్ల(ASHA workers)కు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అదేవిధంగా ఏ ఎన్ సీ టార్గెట్ ఎత్తివేయాలని డిమాండ్ చేసినారు.

ప్రభుత్వ పాఠశాలలో వంట కార్మికులుగా పనిచేసే కార్మికులు వారికి నెలకు పదివేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు పరచడం లేదని వాపోయారు .ఈ కార్యక్రమం బి.ఆర్.టి.యు(BRTU) కరీంనగర్ జిల్లా  అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు ఎండి రబియాబేగం, మధ్యాహ్న భోజనం వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర మంజుల తదితరులు పాల్గొన్నారు.