8 June, 2026 | 4:00 AM

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

08-06-2026 12:00 AM

స్వామివారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల

యాదగిరిగుట్ట, జూన్ 7 (విజయక్రాంతి): ప్రసి ద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆది వారం, వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో కొండపై భాగానికి వాహనాలను అధికారులు అనుమతించలేదు. కొండకింద భాగంలో కూడా వాహనాలు బారులు తీరాయి. ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెం డు గంటల సమయం పట్టింది.

మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం స్వామివారిని 92వేల మంది దర్శించుకోగా నిత్యరాబడి కిం ద రూ.73,75,642 సమకూరినట్లు దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లు ఆదివారం దర్శించుకున్నారు. కిషన్‌రెడ్డి శనివారం రాత్రి ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేసి ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు.

ఆయ నకు ఆలయ అర్చకులు, కార్యనిర్వణాధికారి భ వానీ శంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం కేంద్రమంత్రికి స్వా మివారి లడ్డూ, ప్రసాదం, మోమెంటో అందజేశారు. సాయంత్రం ఎంపీ ఈటల రాజేందర్ స్వామి వారిని దర్శించుకున్నారు. లడ్డూ, ప్రసా దం, మోమెంటోను అందించారు.