మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, మార్చి 1 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తుడు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుతున్నప్పటికీ, భక్తుల తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. బ్రహ్మోత్సవాలలో ఇంకా రెండు వారాలే మిగిలి ఉండడంతో క్షేత్రానికి భక్తుల తాకిడికి ఎక్కువైంది. శనివారం నుంచి మొదలైన భక్తుల రాక ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది.
మల్లన్న సన్నిధానం చేరుకున్న భక్తులు స్వామివారి పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి, గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ ను దర్శించుకున్నారు. మొక్కులో భాగంగా పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నివేదించి, ఒడి బియ్యం పోసి, తల్లిని భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.
ఉద్యోగ బాధ్యత చేపట్టిన ఈవో
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కార్యనిర్వహణ అధికారిగా దేవదాయ శాఖ డిప్యూ టీ కమిషనర్ డి కృష్ణ ప్రసాద్ ఆదివారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పని చేసిన టంకశాల వెంక టేష్ ఉద్యోగ విరమణ కావడంతో కాళీ ఏర్పడింది.
3న ఆలయ దర్శనాలు నిలిపివేత
చంద్రగ్రహణం మూలంగా మంగళవారం రోజున మల్లికార్జున స్వామి ఆలయ దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. ప్రధాన ఆలయం, అనుబంధాలయాలు మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు.ఉదయం 6 గంటల నుం చి సాయంత్రం 7-30నిముషాలు వరకు స్వా మివారి దర్శనాలు, ఆర్జిత సేవలు పూర్తిగా నిలిపి వేయడం జరుగుతుందన్నారు. సా యంత్రం ఆలయ శుద్ధి, సాంప్రోక్షణ చేసిన తర్వాత ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయన్నారు.




