13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

రూ.కోటి 50 లక్షలతో జంక్షన్ల అభివృద్ధి

11-10-2025 01:51 AM
  1. జంక్షన్లలో మహనీయుల విగ్రహాలు 

ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్ పూర్, అక్టోబర్ 10 :అమీన్పూర్ మండలం బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు 68 కోట్ల రూపాయలతో చేపట్టిన 100 ఫీట్ల రహదారి విస్తర ణలో భాగంగా మండే మార్కెట్ జంక్షన్, గ్రీన్ ఫీల్ జంక్షన్, పటేల్ గూడ డబుల్ బెడ్ రూమ్ జంక్షన్లను ఒక కోటి 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం ఉదయం రెవెన్యూ, ము న్సిపల్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి కూడళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆ ర్ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెం దుతున్న బీరంగూడ, కిష్టారెడ్డిపేట రహదారి పరిధిలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గత ప్రభుత్వ హయాంలో బీరం గూడ కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ కోసం 68 కోట్ల రూపాయల కేటాయించి 100 ఫీట్ల రహదారిగా విస్తరించడం జరిగిందని తెలిపారు.

రహదారి పరిధిలోని మండే మా ర్కెట్, గ్రీన్ ఫీల్ జంక్షన్, పటేల్ గూడ డబుల్ బెడ్ రూమ్ జంక్షన్ల అభివృద్ధికి ఒక కోటి 50 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్ జంక్షన్ లో శివాజీ విగ్రహం, పటేల్ గూడా డబుల్ బెడ్ రూమ్ జంక్షన్ లో మహాత్మా గాంధీ విగ్రహాలను సొంత నిధులతో ఏర్పాటు చేయబోతున్న ట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు తెలిపా రు. సింఫనీ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.